వరి వేయొద్దు – ప్రత్యామ్నాయ పంటలకు మారండి: RARS
NANDYAL Aug08 :- వరి వేయొద్దు – ప్రత్యామ్నాయ పంటలకు మారాలని తెలియజేస్తూ శనివారం వెలుగోడు మండలంలోని పలు గ్రామాల్లో ఎల్నినో కంబాట్ టీం – రార్స్ శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఇదివరకే వేసిన పంటలను వర్షాభావ పరిస్థితుల నుండి ఏ విధంగా కాపాడుకోవాలో రైతులకు అవగాహన కల్పించారు.ఇంతవరకు ఎటువంటి పంటలు వేయని రైతులకు వర్షాభావ పరిస్థితులను తట్టుకొనగలిగే ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలని RARS అధికారులు తెలిపారు

మండల వ్యవసాయ అధికారిని ఎస్ స్వాతి ఆధ్వర్యంలో శనివారం బోయరేవుల, వేల్పనూరు గ్రామాల లో రైతు సేవ కేంద్రం నందు రైతులకు ఎల్ నినో పరిస్థితుల మీద మరియు పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ, నంద్యాల,ఎల్ నినో కంబ్యాక్టీన్ టీం నుండి ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఎంటమాలజీ విభాగము డాక్టర్ మంజునాథ్ , అసిస్టెంట్ ప్రొఫెసర్ సాయిల్ సైన్స్ జయచంద్ర రెడ్డి మరియు సీనియర్ సైంటిస్ట్ ప్లాంట్ బ్రీడింగ్ మోహన్ విష్ణువర్ధన్ రైతులకుఇదివరకే వేసిన పంటలను వర్షాభావ పరిస్థితుల నుండి ఏ విధంగా కాపాడుకోవాలి అవసరమైనప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనే అంశంపై రైతులకు అవగాహన కల్పించడం మరియు ఇంతవరకు ఎటువంటి పంటలు వేయని రైతులకు వర్షాభావ పరిస్థితులను తట్టుకొనగలిగే ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవడానికి సన్నద్ధం చేయడం జరిగింది.

PMDS కిట్స్ మరియు పెలటైజేషన్ పద్ధతి ద్వారా విత్తుకోవడము అనే పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడం జరిగింది.శనివారం పొలం పిలుస్తుంది కార్యక్రమం మోత్కూర్ గ్రామంలో నిర్వహించడం జరిగింది. రైతులతో ఈ కింది వివరించడం జరిగింది
Arattai