నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమం
NANDYAL Aug22 :- నంద్యాల పట్టణంలోని PSC & KVSC ప్రభుత్వ డిగ్రీ కళాశాల నంద్యాల నందు ఘనంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆగస్టు నెల పరిసరాల పరిశుభ్రత అనేటటువంటి ప్రత్యేక అంశాన్ని తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కళాశాల యందు డాక్టర్ ఎన్ శశికళ గారు ప్రిన్సిపల్ ఈ కార్యక్రమాన్ని విద్యార్థులతో మరియు సిబ్బంది అందరితో కలిపి స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞను అందరికీ చేయించడం జరిగింది.

అనంతరం కళాశాల పరిసరాలను మరియు తరగతి గదులను విద్యార్థులు శుభ్రం చేయడం జరిగింది ఈ కార్యక్రమం వల్ల ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహ కలిగి ఉండాలని ప్రిన్సిపల్ గారు సందేశాన్ని ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర స్వచ్యాంద్ర కోఆర్డినేటర్ కె శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం నందు కళాశాల ప్రిన్సిపల్ గారు మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Arattai