వ్యవసాయ పాలిటెక్నిక్ లో ఖాళీ సీట్ల భర్తీకి 27న స్పాట్ కౌన్సిలింగ్
NANDYAL Aug22 :- ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయుటకు ఈ నెల 27న స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు RARS, నంద్యాల ADR డా.వి.జయలక్ష్మి తెలిపారు. రెండు సంవత్సరాల వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సుకు సంబంధించిన ఈ కౌన్సిలింగ్ నంద్యాలలోని RARS కార్యాలయంలోనిర్వహిస్తున్నట్లు తెలిపారు. పదో తరగతి, ఇంటర్ అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 99896 25208 నంబర్ ను సంప్రదించాలన్నారు.
Arattai