నంద్యాలలో ఘనంగా ప్రకాశం పంతులు జయంతి వేడుకలు
NANDYAL AUG23 :– నంద్యాల పట్టణంలో టౌన్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 154 వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సభ్యులు టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా సేవలందించిన టంగుటూరి ప్రకాశం పంతులు స్వాతంత్ర్య సమరయోధుడిగా, ప్రజానాయకుడిగా దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. బ్రిటిష్ పాలకుల తుపాకులకు ఎదురొడ్డి నిలిచిన ఆయన ధైర్యసాహసాల కారణంగానే ప్రజలు ఆయనను ఆంధ్రకేసరిగా గౌరవించారని తెలిపారు. ఆయన నిస్వార్థ ప్రజాసేవ, దేశభక్తి నేటి తరానికి ఆదర్శమని అన్నారు.ఉపాధ్యాయులు అన్నెం శ్రీనివాసరెడ్డి ప్రకాశం పంతులు స్వాతంత్ర్య ఉద్యమంలో పోషించిన కీలక పాత్రతో పాటు ప్రజాసేవలో ఆయన చూపిన అంకితభావాన్ని వివరించారు. దేశం కోసం, ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి ప్రకాశం పంతులు అని పేర్కొన్నారు.కార్యక్రమంలో క్లబ్ మాజీ అధ్యక్షులు డివి సుబ్బయ్య, చింతల మోహన్రావు, కాల్వ నాగరాజు, క్లబ్ సభ్యులు ఆత్మకూరు సుబ్రమణ్యం, వెంకటేశ్వర్లు, ప్రసాద్, మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.
Arattai