బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ను సందర్శించిన నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
NANDYAL Aug28 :- నంద్యాల, ఆగస్టు 28: నందికొట్కూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిత్త జయసూర్య గారు, నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా గారు శుక్రవారం బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ను సందర్శించి నీటి ప్రవాహం, సాగునీటి సరఫరా పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా రెగ్యులేటర్ వద్ద నీటి ప్రవాహం, ప్రస్తుత సాగునీటి పరిస్థితులు, రైతులకు అందుతున్న నీటి సరఫరా తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రైతులకు సాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, అవసరమైన చోట అధికారుల మధ్య సమన్వయంతో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. సాగునీటి వనరులను సమర్థవంతంగా వినియోగించడంతో పాటు రైతులకు అవసరమైన సమయంలో నీరు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Arattai