నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవం
NANDYAL Aug29 :- నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శైలజాల రాణి,కళాశాల వ్యాయామ అధ్యాపకుడుశ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించారుఈ కార్యక్రమంలో ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా దేశానికి క్రీడారంగంలో ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.భారతదేశానికి హాకీలో అద్భుతమైనటువంటి స్థాయిలో పేరు రావడానికి ధ్యాన్‌చంద్ గారి కృషి పట్టుదల ఎంతో ఉంది అని తెలియజేశారు అలాగే నేటి ప్రభుత్వం కూడా క్రీడలను గుర్తిస్తూ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రతి ఒక్క ఉద్యోగ అవకాశాలలో మూడు శాతం రిజర్వేషన్ కల్పించడం కూడా గర్వించదగ్గ విషయమని ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అలాగే కళాశాల వివిధ క్రీడాంశములయందు పథకాలను సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు
Arattai