లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో టీచర్లకు సత్కారం
NANDTYAL Sep06:- నంద్యాల పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.సీనియర్ లయన్స్ సభ్యులు శ్రీకాంత్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు

లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సందీప్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి చంద్రశేఖర్, కోశాధికారి సురేష్,రీజియన్ చైర్మన్ నిజాముద్దీన్,జోనల్ చైర్మన్ నాగరాజు, లయన్ చాటర్ మెంబర్ ఆంజనేయులు గుప్తా, సీనియర్ సభ్యులు గోల్ల సుదర్శనం,ఎంపీ వి రమణయ్య అతిథులుగా పాల్గొన్నారు.

విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. సమాజానికి ఉత్తమ సేవలందిస్తున్న ఉపాధ్యాయులను గౌరవించడం తమ క్లబ్ లక్ష్యాల్లో ఒకటని లయన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు జి.పద్మావతి, పి.కేశమ్మ, ఎం.ఆర్.టి ప్రసాద్, పి.రంగనాథ్ లకు ఉపాధ్యాయ దినోత్సవ పురస్కారాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుంకయ్య, రామయ్య,వాసుకుట్టి మరియు సభ్యులు పాల్గొన్నారు.

Arattai