సెప్టెంబర్ 12న నంద్యాలలో రాష్ట్రస్థాయి చెస్ పోటీలు
NANDYAL Sep07:- నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఎన్ ఆర్ జి చెస్ అకాడమీ నిర్వహణలో ఈనెల 12వ తేదీన నంద్యాల టెక్కే లో ఉన్న నెరవాటి ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు నిర్వహిస్తున్నామని నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ రవి కృష్ణ, కార్యదర్శి రామ సుబ్బా రెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు. ఈ పోటీలు 12 వివిధ వయసు విభాగాల్లో వేరువేరుగా జరుగుతాయని తెలిపారు. టోర్నమెంట్ కోఆర్డినేటర్స్ గా నెరవాటి స్కూల్ డైరెక్టర్ & కరస్పాండెంట్ ఆనందగుప్తా,
కృష్ణ సాయి రోహిత్ లు వ్యవహరిస్తారని అన్నారు.రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచిన వారికి ఒక్కొక్క క్యాటగిరి లో 10 ప్రైజ్ ల చొప్పున మొత్తం 120 ప్రైజ్ లను ఇవ్వడం జరుగుతుందన్నారు.ఆసక్తి ఉన్న చెస్ క్రీడాకారులు ఏపీ చెస్ వెబ్సైట్ ద్వారా ఈనెల 09 వ తేదీ సాయంత్రం లోపు ఎంట్రీలు నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 9010451585, 9573661799 నెంబర్ లను సంప్రదించాలని తెలిపారు.
Arattai