ఈనెల 11న శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థానం నందు సుదర్శన యాగం
NANDYAL Sep09 :- నంద్యాల పట్టణంలోని శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థానం నందు ఈనెల 11వ తేదీ అమావాస్య నాడు సుదర్శన యాగం నిర్వహిస్తున్నట్లు దేవస్థానం చైర్మన్ అనిల్ కుమార్ తెలిపారు.శుక్రవారం తెల్లవారుజామున నిజరూప దర్శన ఆంజనేయస్వామి కి ప్రత్యేక అభిషేకాలు,అనంతరం 8 గంటలకు లోక కళ్యాణార్థం,వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ,పండితులు రఘోత్తమ ఆచార్యుల ఆధ్వర్యంలో సుదర్శన యాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.సాయంత్రం 7 గంటలకు దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అలాగే శనివారం ఉదయం 8 గంటలకు రామాలయం నందు స్వాముల వారికి అభిషేకము నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో దేవస్థానం చైర్మన్ అనిల్ కుమార్, కమిటీ సభ్యులు భారతి,పద్మావతి,జంబులయ్య,ఆది, ప్రధాన అర్చకులు సుబ్బయ్య శర్మ, శివ, దేవస్థానం సిబ్బంది అంజి పాల్గొన్నారు
Arattai