స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రక్తదాన శిబిరం
NANDYAL Aug15:- 80 వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని శ్రీనివాస్ నగర్ లో ఉన్న వందే మార్ట్ ( వి మార్ట్) ఆధ్వర్యంలో,వందే మార్ట్ నిర్వాహకులు చంద్రశేఖర రెడ్డి,మల్లికార్జున రెడ్డి,రాఘవేంద్రల నిర్వహణలో, విజయ బ్లడ్ బ్యాంక్ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అంతర్జాతీయ లయన్స్ సేవా సంస్థ డిస్ట్రిక్ట్ 316 జె వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్,ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ జాతీయ పతాకం ఆవిష్కరించగా,రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర ఐఎంఏ మహిళా విభాగం కార్యదర్శి డాక్టర్ లక్ష్మీ సౌజన్య, ఐఎంఏ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ వసుధ, నంద్యాల ఐఎంఏ మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి ప్రారంభించారు.

ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో రక్తదాన శిబిరం నిర్వహించడం ప్రశంసనీయమని నిర్వాహకులను అభినందించారు.
వందే మార్ట్ నిర్వాహకులు మల్లికార్జున రెడ్డి,రాఘవేంద్ర మాట్లాడుతూ తమ సూపర్ మార్కెట్ల వద్ద ప్రతి ఏటా స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహించడంతోపాటు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి తమ సిబ్బంది రక్తదానం చేస్తున్నామన్నారు.రక్త దాన శిబిరంలో 40 మంది దాతలు రక్త దానం చేశారు. వారికి పండ్లు,బ్లడ్ బ్యాంక్ తరపున ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో వందే మార్ట్ నిర్వాహకులు మల్లికార్జున రెడ్డి, రాఘవేంద్ర, భరత్ కుమార్ రెడ్డి, గణేష్ రెడ్డి, ఎల్లారెడ్డి, జగదీష్ రెడ్డి, సురేష్ ,విజయ బ్లడ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ రహమతుల్లా,రక్తదాన శిబిర నిర్వాహకులు దాదా భాయి,నజీర్, సద్దాం, రసూల్, కిషోర్ వందే మార్ట్ సిబ్బంది పాల్గొన్నారు.
Arattai