విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో యువతులకు శిక్షణ
NANDYAL May24 :- నంద్యాల పట్టణ శివారు లోని SDR స్కూల్ నందు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో దుర్గా వాహిని దక్షిణాంధ్ర ప్రాంత శౌర్య ప్రశిక్షణ పేరిట యువతలకు శిక్షణా కార్యక్రమాన్ని వారం రోజులు పాటు నిర్వహిస్తున్నారు.ఆదివారం జరిగిన కార్యక్రమంలో కేంద్రీయ అధికారి ప్రజ్ఞ పాల్గొన్నారు.16 సంవత్సరములు నుండి35 సంవత్సరంలో లోపు యువతలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని నంద్యాల నగర అధ్యక్షురాలు సానం రెడ్డి సుహాసిని తెలిపారు.యోగా,కర్ర సాము తదితర వాటిల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.యువతులను శారీరకంగా మానసికంగా దృఢంగా తయారు చేసేందుకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు
Arattai