శ్రీ రామకృష్ణ డిగ్రీ అటానమస్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం
NANDYAL Sep09:- శ్రీ రామకృష్ణ డిగ్రీ అటానమస్ కళాశాలలో బుధవారం నాడు ను డిగ్రీలో మొదటి సంవత్సరం చేరిన విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం సరస్వతి పూజ కార్యక్రమం తో ఘనంగా ప్రారంభించారు

ఈ కార్యక్రమానికి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాల అటానమస్ గుర్తింపు, యుజిసి మరియు నాక్ గుర్తింపులో “A” గ్రేడ్ స్థానం సంపాదించి విద్యార్థిని/విద్యార్థులకు నాణ్యమైన విద్య, నైపుణ్యాలను అభివృద్ధి అందించడంలో రాష్ట్రంలో అగ్రమిగా ఉన్నందుకు గర్వపడుతున్నాం అలాగే కళాశాలలో ఉన్న వసతులు గురించి ప్రస్తుతం విద్యార్థులకు తెలియజేస్తూ,కళాశాలలో లైబ్రరీ, గ్రౌండ్, విశాలమైన తరగతి గదులు, డిజిటల్ బోర్డులు, ఇండోర్ స్టేడియం, రైఫిల్ షూటింగ్, కంప్యూటర్ ల్యాబ్లు, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ వంటి సదుపాయాలు ఎన్నో ఉన్నాయి. వీటిని విద్యార్థులు తమ మూడు సంవత్సరాల విద్యా కాలంలో సక్రమంగా ఉపయోగించుకోవాలని గొప్ప వ్యక్తిత్వంతో, క్రమశిక్షణతో ఎదిగి చక్కగా చదువుకొని కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఉపయోగపడాలి ఆ విధంగా ఈ కళాశాల పేరును ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్లాలని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కళాశాల చైర్మన్ అవగాహన కల్పించారు.అలాగే కళాశాల ప్రిన్సిపల్ కేబీవి సుబ్బయ్య గారు మాట్లాడుతూ నూతనంగా కళాశాలలో చేరుతున్న విద్యార్థిని/విద్యార్థులకు స్వాగతం పలుకుతూ విద్యార్థిని/విద్యార్థుల లో ఉన్నటువంటి స్కిల్స్ ను అభివృద్ధి చేయడం కోసం కళాశాల పాటుపడుతుందని చెప్పారు. వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
కళాశాల డైరెక్టర్ పి.ప్రగతి మాట్లాడుతూ విద్యార్థిని/విద్యార్థులకు ప్రతి ఒక్కరు చదువుకునేలా ప్రోత్సహించడం మన బాధ్యత అని పిలుపునిచ్చారు. కళాశాలలో మంచి క్రమశిక్షణతో వెలుగుతూ బాధ్యతగా ఉండాలని ఆ విధంగా కళాశాల మీకు అన్ని విధాల తోడ్పాటు సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు.పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థుల సందేహాలకు కళాశాల చైర్మన్ నివృతి భావించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు తమకు తాము పరిచయం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ యు వి ఎస్ కుమార్, సంపత్ కుమార్, డాక్టర్ పుల్లయ్య, డాక్టర్ లలితా సరస్వతి, మురళీధర, ఆండ్రూస్, శ్రీమతి హిమబిందు, మద్దిలేటి, శివరాజు, సత్యనారాయణరెడ్డి, మస్తాన్, విజయ్ కాంత్ తదితరులు మరియు విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. జాతీయగీతంతో కార్యక్రమం ముగిసింది.
Arattai