నంద్యాలలో 13 ఏళ్లుగా మట్టి గణపతికే(పూజలు)పట్టం
NANDYAL Sep12 :- నంద్యాల పట్టణం బాలాజీ కాంప్లెక్స్ లోని శ్రీమతి కశెట్టి సుబ్బమ్మ మరియు బాలాజీ మర్చంట్స్ కమిటీ కళ్యాణ మండప దేవస్థానం నందు 40వ శ్రీ వరసిద్ధి వినాయక చవితి ఉత్సవములు ఘనంగా నిర్వహిస్తున్నారు.పర్యావరణ పరిరక్షణ కాలుష్య నివారణ నిమిత్తం నంద్యాల పట్టణంలో మొట్టమొదటిసారిగా గత 13 సంవత్సరాల నుండి మట్టితో వినాయక విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. విగ్రహాన్ని టంగుటూరు గ్రామస్తులు కుమ్మరి మద్దిలేటి వాళ్ళ శిష్య బృందం చేత మూడు నెలల పాటు విగ్రహాన్ని తయారు చేస్తారు.

ఈ సంవత్సరం ప్రత్యేకతగా మత్స్య ,కూర్మ ,వరాహ,నరసింహ, విశ్వ సంరక్షక మహాగణపతిగా స్వామి వారిని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు కశెట్టి కృష్ణమూర్తి, చంద్రశేఖర్ లు మాట్లాడుతూ 14వ తేదీ సోమవారం నుండి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయని ,16వ తేదీ బుధవారము విశ్వ సంరక్షక మహాగణపతి హోమము నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తాదులు ఈ హోమంలో పాల్గొనాలని కోరారు.

40 సంవత్సరాల వినాయక ఉత్సవాల సందర్భంగా మొట్టమొదటిసారిగా చేతి లడ్డూను 18వ తేదీ నిమజ్జనం రోజు శుక్రవారం ఉదయం 11 గంటలకు దేవస్థానం నందు లడ్డు వేలం వేయబడునని కావున భక్తాదులు ఈ లడ్డువేలంలో పాల్గొని స్వామివారి లడ్డూను స్వీకరించాలని కోరారు.గత 25 సంవత్సరాల నుండి 1500 మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తూ వస్తున్నామని,పర్యావరణ పరిరక్షణ కాలుష్య నివారణ నిమిత్తం మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కశెట్టి కృష్ణమూర్తి,దేవస్థాన అధ్యక్షులు నారాయణ శ్రీనివాస కుమార్, ప్రధాన కార్యదర్శి దుద్దేల సురేష్ బాబు, కోశాధికారి లగిసెట్టి నవీన్ కుమార్ లగ్గిశెట్టి ఋషి కుమార్ నల్లగట్ల నరసింహారావు బొగ్గరపు వంశీకృష్ణ కొప్పర్ల శ్రీనివాస్, రవితేజ,పాలూరి వెంకటనారాయణ,అడ్డగాళ్ళ చంద్రశేఖర్, సునీల్,,పసుపుల శివ సాయి తదితరులు పాల్గొన్నారు .
Arattai