అశోక్ సింఘాల్ శతజయంతి వేడుకలకు జిల్లా ప్రజలు తరలిరావాలి : శేష సాయి
NANDYAL Sep 19 :- అక్టోబర్ 4వ తేదిన కర్నూలు పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ (VHP)ప్రముఖ నాయకుడు అశోక్ సింఘాల్ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా VHP సంపర్క ప్రముఖ్ శేషసాయి తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా విశ్వహిందూ పరిషత్ కార్యాలయం నందు కరపత్రాలను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సంపర్క్ ప్రముఖ్ శేషసాయి, జిల్లా సహా సంపర్క ప్రముఖ్, జిల్లా సహా కార్యదర్శి పాల్గొన్నారు.ఈ సందర్భంగా శేష సాయి మాట్లాడుతూ అశోక్ సింఘాల్ దేశంలో హిందువులను ఏకీకృతం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారని తెలిపారు.అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణ ఉద్యమం కోసం అవిరళ కృషి చేశారని తెలిపారు.అశోక్ సింఘాల్ సేవలను స్మరించుకుంటూ నిర్వహించే ఈ శతజయంతి వేడుకల్లో జిల్లా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని శేషసాయి కోరారు.
Arattai