నేడు బనగానపల్లెలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎంపిడిఓ, ఏపిఓ, ఏపీఎం, ఎంఏఓ లతో సమావేశం నిర్వహించిన… రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి…
ఈ నెల 16 న కర్నూల్ లో ప్రధాని పర్యటనకు బనగానపల్లె నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉంది.

ప్రధాని సభకు నియోజకవర్గం నుంచి హాజరయ్యే ప్రజలకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించిన మంత్రి..
అధికారులంతా సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

ప్రధాని సభకు హాజరయ్యే వారికి రవాణా, ఆహారం, తాగునీరు వంటి సదుపాయాలు విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి
సభకు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలి
ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా.. సభా వేదికకు ముందుగానే చేరుకునే విధంగా రవాణా ఏర్పాటు చేయాలి
Arattai