NANDYAL Oct 21 :- నంద్యాల పట్టణంలోని,నవనందుల్లో ఒకటైన ప్రధమనందీశ్వర స్వామి దేవస్థానం నందు రేపు కార్తీక మాసం ప్రారంభం రోజున అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు దేవస్థానం అభివృద్ధి కమిటీ సభ్యులు చలం బాబు తెలిపారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ఫరూక్,ఎంపీ శబరి, జిల్లా కలెక్టర్ రాజకుమారి దేవస్థానం అధికారులు పాల్గొంటారని తెలిపారు.
నెలరోజులపాటు జరిగే అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకులను,పట్టణ ప్రముఖులను ప్రభుత్వ అధికారులను ఆహ్వానించి, ప్రతిరోజు వారిచే అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.నెలరోజుల పాటు జరిగే అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు
దేవస్థానం నందు జరుగు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
Leave a Reply