డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లవరం మండలం, ఓడలరేవులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ బాధితులను పరామర్శించారు.
పునరావాస కేంద్రాల్లోని నిర్వాసిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, 25 కేజీల బియ్యం, ఒక్కో కుటుంబానికి రూ.3 వేల చొప్పున సాయం అందించారు.
అనంతరం అరగట్లపాలెం, బెండమూరులంక గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలను సీఎం చంద్రబాబు పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
Arattai