నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో,నంద్యాల లయన్స్ క్లబ్ సహకారంతో నవంబర్ 7వ తేదీ, శుక్రవారం ఉదయం 10 గంటలనుంచి మధ్యాహ్నం 2 వరకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిర వివరాలతో కూడిన కరపత్రాలను గురువారం ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ,నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కోశాధికారి నెరవాటి వినోద్ కుమార్,అమిదేల జనార్ధన్,డాక్టర్ నెరవాటి గగన్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్ మాట్లాడుతూ పద్మావతి నగర్ లో ఉన్న నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరంలో చెవి ముక్కు గొంతు వైద్యులు డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్,సంతాన సాఫల్య నిపుణురాలు డాక్టర్ అరుణకుమారి,ఎముకలు,కీళ్ల వైద్యులు డాక్టర్ సుమన్ కుమార్, ప్రసూతి,స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఫాతిమాబి,జనరల్ మెడిసిన్ వైద్యులు డాక్టర్ దేవేంద్ర నాయక్ లు రోగులను పరీక్షించి,ఉచితంగా వినికిడి పరీక్షలు,ఎముకల సాంద్రత పటిష్ట పరీక్షలు,రక్త పరీక్షలు,అవసరమైన వారికి అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేసి మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ శిబిరంలో వినికిడి మిషన్ 30 శాతం రాయితీ తో తయారీ కంపెనీ అందజేస్తుందన్నారు. నంద్యాల పట్టణం,పరిసర ప్రాంతాల ప్రజలు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Arattai