శుక్రవారం స్థానిక పద్మావతి నగర్ లో ఉన్న నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతమైంది.
నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ నెరవాటి వినోద్, డాక్టర్ నెరవాటి అరుణ కుమారిల నిర్వహణలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, ప్రముఖ వ్యాపారవేత్త నెరవాటి సత్యనారాయణ, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా డాక్టర్ నెరవాటి వినోద్,డాక్టర్ నెరవాటి అరుణ కుమారి మాట్లాడుతూ తమ నెరవాటి ఆసుపత్రి రెండు దశాబ్దాలుగా గాంధీ చౌక్ లో సేవలు అందించి ఇటీవల పద్మావతి నగర్ లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించి ప్రారంభించామని, ఆసుపత్రి స్థాపించి 21 సంవత్సరాలు ఆయన సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ సహకారంతో ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించామని తెలిపారు.
ఈ శిబిరంలో చెవి ముక్కు గొంతు సంతానలేమి స్త్రీ వ్యాధులు, గర్భిణీ స్త్రీలు, ఎముకలు కీళ్లు, బిపి, షుగర్ వంటి జనరల్ మెడిసిన్ విభాగాలలో తమతో పాటు డాక్టర్లు సుమన్ కుమార్ ఫాతిమా బి దేవేంద్ర నాయక్ వైద్య సేవలు అందించామన్నారు.
శిబిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆసుపత్రి వైద్యులు వినోద్ కుమార్, అరుణకుమారి, సుమన్ కుమార్, ఫాతిమా బి దేవేంద్ర నాయక్ లు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు.ఈ ఆసుపత్రిలో వర్టిగో,అలర్జీ ప్రత్యేక క్లినిక్ లు కూడా ఇటీవల ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని ప్రశంసించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త నెరవాటి సత్యనారాయణ,నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, జోన్ చైర్మన్ నిజాముద్దీన్,కోశాధికారి అమిదేల జనార్ధన్, డాక్టర్ నెరవాటి గగన్, ఆడియాలజిస్ట్ వినయ్, ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఈ శిబిరంలో 400 మంది రోగులను వైద్యులు పరీక్షించి అవసరమైన వారికి లక్ష రూపాయల విలువైన వినికిడి పరీక్షలు,ఎముకల సాంద్రత పరీక్షలు,అల్ట్రా సౌండ్ స్కానింగ్,రక్త పరీక్షలు ఉచితంగా చేసి, అవసరమైన వారికి మొత్తం లక్ష రూపాయల విలువైన మందులను పంపిణీ చేశారు.
Arattai