ఈనెల 16వ తేదీ ఆదివారం నంద్యాల పట్టణంలోని శ్రీ కేదారేశ్వరి సమేత ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో నంద్యాల జిల్లా విశ్వబ్రాహ్మణ ఏకీకృత సంఘం ఆధ్వర్యంలో కార్తిక మాస వనభోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా బుధవారం నిర్వాహకులు కరపత్రాలను విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో సూర్య ప్రకాష్ ఆచారి,చంద్రశేఖర్ ఆచారి,నాగయ్య ఆచారి,లక్ష్మీనారాయణ ఆచారి, సత్యనారాయణ ఆచారి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈనెల 16వ తేదీ ఆదివారం నంద్యాల పట్టణంలోని ప్రధమ నందీశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో కార్తీకమాస వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ వనభోజన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంక్షేమ&అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ మరియు నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు కమ్మరి పార్వతమ్మ,అలాగే ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంక్షేమ&అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ రంగాచార్యులు విశ్వకర్మ లు హాజరవుతారని తెలిపారు.జిల్లాలోని విశ్వ బ్రాహ్మణులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు
Arattai