రాష్ట్ర చలన చిత్ర టి.వి, నాటకరంగ అభివృధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్
గోవాలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం-2025 ను నవంబర్ 20 నుండి 28 వరకు నిర్వహిస్తున్నారని ఇందులో మన రాష్ట్రం తరపున ప్రత్యేక శకటం 20 వ తేదీన నిర్వహించిన ప్రారంభోత్సవ పెరోడ్ లో ప్రదర్శించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర టీ.వి, నాటకరంగ అభివృధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

భారత ప్రభుత్వ ప్రసార మంత్రిత్వ శాఖ సెక్రటరీ సంజయ్ జాజు ఆహ్వానం మేరకు 20 నవంబర్ 2025 నుండి గోవాలో ప్రారంభమైన అంతర్జాతీయ చలనచిత్ర వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్రం నుండి 50 వసంతాలు పూర్తి చేసుకున్న ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర టి.వి మరియు నాటకరంగ అభివృధి సంస్థ నుండి మొట్టమొదటిసారిగా The Hear Beat of Indian Cinema and Tourism థీమ్ తో ప్రత్యేక శకటం 20 మంది డూప్ లైవ్ నటీ, నటులతో ప్రత్యేక ఆకర్షణతో చిత్రోత్సవాల పెరేడ్ లో కనువిందు చేశాయన్నారు.

రాష్ట్రంలోని సినిమా షూటింగ్ లొకేషన్లకు సంబందించిన ఛాయా చిత్రాలను ఉదాహరణకు గండికోట, అరకు, బొర్రా గుహలు, పాపికొండలు, లేపాక్షి నంది, క్యాపిటల్ సిటీ అఫ్ అమరావతి, ఎర్రమట్టి దిబ్బలు తదితర అందమైన అటవీ పర్యాటక ప్రాంతాలను శకటంలో ప్రదర్శించారన్నారు.
ఈ చలన చిత్రోత్సవ వేడుకలకు తెలుగు సినిమా కధానాయకుడు, శాసనసభ్యులు, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ, నటి శ్రీలేఖ పాల్గొన్నారు. అంతేకాక గోవా రాష్ట్ర గవర్నర్ అశోక్ గజపతి రాజ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు జాతీయ స్థాయి నటీ, నటులు ఈ వేడుకుల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర టి.వి మరియు నాటకరంగ అభివృధి సంస్థ తరపున మేనేజర్ ఎం. శ్రీనివాస్ నాయక్ పాల్గొన్నారు.

ఈ ప్రారంబోత్సవ వేడుకల్లో రాష్ట్ర శఖటంతో పాటు కర్ణాటక, గోవా, నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చెందిన శకటాలు ప్రదర్శనలో పాల్గొన్నాయి.
Arattai