నంద్యాల పట్టణం ఎస్ పి జి హై స్కూల్ క్రీడా మైదానం నందు సోమవారం సమగ్ర శిక్ష ఆంధ్ర ప్రదేశ్ నంద్యాల శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు పారా స్పోర్ట్స్ జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు.ఈ పోటీలను జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి ప్రారంభించారు

జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని శారీరక ధృత్వాన్ని పెంపొందిస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ జనార్దన్ రెడ్డి గారు అన్నారు.

సోమవారం నంద్యాల సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పారా స్పోర్ట్స్ మీట్ ఫర్ చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్ ( ప్రత్యేక అవసరాలు పిల్లల) నంద్యాల జిల్లా స్థాయి పోటీలను ఎస్ పి జి హై స్కూల్ ఏర్పాటుచేసిన పోటీలను ఆయన ప్రారంభించారు. డి ఈ ఓ గారు స్వయంగా షాట్ పుట్, లాంగ్ జం పాల్గొని విద్యార్థులకు స్ఫూర్తిని పెంచారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇలాంటి క్రీడ నిర్వహించినప్పుడు ప్రతి విద్యార్థి అందులో పాల్గొని తమ ప్రతిభలను వెలికి తీయాలి అన్నారు. ఇలాంటి పిల్లలను సేవ చేయడం దేవుడిచ్చిన వరంగా భావించి ప్రతి ఒక్కరూ వారి భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. అనంతరం జిల్లా విలీన విద్య సమన్వయకర్త జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లాస్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామన్నారు.

జిల్లాలోని అన్ని మండలాల నుంచి ప్రత్యేక అవసర గల పిల్లలు భవిత కేంద్ర ఉపాధ్యాయులు(ఐఈఆ ర్ టి) తీసుకొని రావడం జరిగింది. రన్నింగ్ 100 మీటర్స్, 400 మీటర్స్, లాంగ్ జంప్, హై జంప్, షాట్ పుట్, జావీలన్ త్రో పోటీలను అండర్ 17 అండర్ 19 నిర్వహించడం జరిగింది విభాగాలలో బాలురులకు బాలికలకు వేరువేరుగా నిర్వహించడం జరిగింది.

జిల్లా స్థాయి గెలిచిన విద్యార్థులకు రాష్ట్రస్థాయి ఒలంపిక్ పంపడం జరుగుతుంది అన్నారు. క్రీడల్లో ప్రధమ ద్వితీయ ద్వితీయ స్థానాలను ఇచ్చిన విద్యార్థులకు మెడల్స్ తో పాటు ప్రశంస పత్రాలను అందజేయడం జరిగింది. క్రీడల్లో పాల్గొన్న పిల్లలకు మధ్యాహ్న భోజన తో పాటు రవాణా భత్యం కూడా ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నంద్యాల డయాలసిస్ బిషప్ శ్రీ సంతోష్ ప్రసన్న రావు, నంద్యాల మండల విద్యాధికారి శివరాం ప్రసాద్, అల్లెస్కో కోఆర్డినేటర్ ప్రసన్న కుమార్, ఏ ఎం ఓ మాధవి, విలీన విద్య సహాయ సమన్వయకర్త శ్రీనివాసులు, పీడీలు విశ్వనాధ్, నాగరాజు,పాల్గొన్నారు
Arattai