ప్రతి ఒక్కరూ ఆధార్ అప్డేషన్ తప్పక చేయించుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ పేర్కొన్నారు.శుక్రవారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాస్థాయి ఆధార్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డిఆర్ఓ రాము నాయక్ మాట్లాడుతూ ఆధార్ కార్డు కలిగిన ప్రతి వ్యక్తి తప్పనిసరిగా తమ ఆధార్ అప్డేషన్ చేయించుకోవాలన్నారు. ఆధార్ అప్డేషన్ కార్యక్రమాలు ఆధార్ నమొదు కెంద్రాలలొ నిర్వహించడం జరుగుతుంది. 5 నుంచి15 సంవత్సరాలు దాటిన పిల్లలు తమ బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరిగ చేయించుకోవాలన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవడం, విద్యాసంస్థల్లో ప్రవేశం, బ్యాంకుల్లో ఖాతాలు తదితర అవసరాలకు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రస్తుతం బిడ్డపుట్టిన వెంటనే శిశుకు కూడా ఆధార్ కార్డు ఇచ్చేలా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.

శిశు ఆధార్ నమోదు, అప్డేట్ తప్పనిసరి
బిడ్డ పుట్టిన వెంటనే ప్రతి శిశువుకు ఆధార్ నమోదు చేయించడంతో పాటు.. ఐదేళ్లు పూర్తయిన వెంటనే.. బయోమెట్రిక్ నమోదు చేయించాలని.. ఆ దిశగా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. పుట్టిన ప్రతి శిశువుకు “శిశు ఆఫ్” ద్వారా తల్లిదండ్రుల ఆధార్ వివరాల ఆధారంగా తప్పనిసరిగా ఆధార్ నెంబర్ నమోదు చేయాలని.. 5 సంవత్సరాల 4 నెలలు పూర్తి అయిన తర్వాత పిల్లల ఫింగర్ ప్రింట్ తో బయోమెట్రిక్ సీడింగ్ చేయించాలన్నారు. ఈ ప్రక్రియను వైద్య ఆరోగ్య శాఖ, అంగన్వాడీ సిబ్బంది సమన్వయంతో చేపట్టాలన్నారు.
Arattai