NANDYAL Dec17:- 2026 జనవరి 5 నుండి 10 వరకు దాదర్ & హవేలీ నగర్ మరియు డామన్ & డయులో జరుగే 2వ ఎడిషన్ ఖేలో ఇండియా బీచ్గేమ్స్2025 పోటీలకు రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు ఈ నెల 19న విజయవాడలో ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి ఎం.ఎన్.వి రాజు తెలిపారు.
బీచ్ సెపక్ తక్ర, బీచ్ వాలీబాల్ & బీచ్ కబడ్డి ఒపెన్ ఏజ్ కేటగిరి లోపురుషులు & మహిళల క్రీడా పోటీలకు ఆంధ్ర రాష్ట్రము తరపున ప్రాతినిధ్యం వహించేందుకు ఆశక్తి గల నంద్యాల జిల్లా క్రీడా కారులు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆద్వర్యములో ఈ నెల 19న శుక్రవారం నాడు NTR జిల్లా విజయవాడ,మణిపాల్ హాస్పిటల్ దగ్గర, క్రిష్ణా నది (దక్షిణం వైపు) నందు ఉదయం 9 గంటలకు హాజరుకాగలరని MNV రాజు తెలిపారు
ఆశక్తి గల మహిళలు & పురుష క్రీడా కారులు సంబందిత ద్రువపత్రాలతో అనగా ఆధార్ కార్డు, 2 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు & జనన ద్రువీకరణ పత్రం (మున్సిపల్ కార్పోరేషన్ గ్రామ పంచాయతీ ద్వార జారీ చేయబడిన సర్టిపికేట్స్)తో హాజరు కావాలని తెలిపారు.
ఇతర వివరములకు కె.కోటేశ్వర రావు, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి, ఎన్.టి.ఆర్. జిల్లా, పి.జగదీష్, కబడ్డి కోచ్, ఎన్.టి.ఆర్. జిల్లా -9052464770 9866134016 అనే నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.
Arattai