NANDYAL Dec 19:- నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భౌతికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ శశికళ తెలిపారు.నంద్యాల డివిజన్,APSPDCL ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.భావితరాలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన మేరకు మాత్రమే గదిలోని బల్బులు,ఫ్యాన్లు,కూలర్లు మొదలగు విద్యుత్ సాధనాలను పొదుపుగా వినియోగించాలని శశికళ తెలిపారు.
నంద్యాల డివిజన్, ఏపీఎస్పీడీసీఎల్,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస రెడ్డి విద్యార్థులకు మరియు అధ్యాపకులకు శక్తి యొక్క ఉపయోగాలను విద్యుత్ శక్తి పొదుపు మార్గాలను వివరించారు. AC ఉపయోగించు వారు ఉష్ణోగ్రతను 24 డిగ్రీల సెంటీగ్రేట్ కి తగ్గకుండా వాడుకుంటే విద్యుత్ బిల్లు ఆదా అవుతుందని మరియు ఇంటిలో ఉపయోగించే విద్యుత్ పరికరాలను ఏ విధంగా ఉపయోగిస్తే విద్యుత్ ఆదా చేయవచ్చో వివరించారు.
గదిలలోని కిటికీల నుండి వచ్చే సూర్యకాంతి వెలుతురును మరియు గాలిని ఉపయోగించుకొనుట మరియు సోలార్ విద్యుత్ శక్తి వినియోగాన్ని వారి వారి గ్రామాలలో అవగాహన కల్పించమని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమానికి భౌతిక శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ ఆర్ శశికళ మరియు డాక్టర్ వి రమేష్ కుమార్ మరియ ఇతర అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
Arattai