NANDYAL:-నంద్యాల లయన్స్ క్లబ్ సహకారంతో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సంఘం కార్యాలయంలో సేవా కార్యక్రమం నిర్వహించారు.
లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు కశెట్టి వేణుమాధవ్,కశెట్టి చంద్రశేఖర్, శిరిగిరి రమేష్ ల సౌజన్యంతో ఇద్దరికీ వినికిడి యంత్రాలు, ఒక చక్రాల కుర్చీ పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, అధ్యక్షులు రమణయ్య మాట్లాడుతూ నంద్యాల లయన్స్ క్లబ్ గత పాతిక సంవత్సరాలుగా దివ్యాంగులకు నిరంతర సహకారం కొనసాగిస్తున్నారని అభినందించారు. దాతలు మాట్లాడుతూ దివ్యాంగుల సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారం భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా దాతలు కశెట్టి వేణుమాధవ్,కశెట్టి చంద్రశేఖర్, శిరిగిరి రమేష్ లను నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర రెడ్డి, కోశాధికారి అమిదేల జనార్ధన్, జోనల్ చైర్మన్ నిజాముద్దీన్, నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎం.పీ.వి. రమణయ్య, కార్యాలయ కార్యదర్శి మధు, నిర్వాహక కార్యదర్శి వీరభరతుడు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Arattai