ఈనెల 12వ తేదీ సోమవారం సాయంత్రం ఐదు గంటలకు నంద్యాల పట్టణంలోని సౌజన్య ఫంక్షన్ హాల్ నందు స్వామి వివేకానంద జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు నేషనలిస్ట్ ఎలైట్ ఫోరం సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ నేట్ల మహేశ్వర్ రెడ్డి డాక్టర్ సంతోష్ లు మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతి ఉత్సవానికి ముఖ్యఅతిథిగా సీనియర్ జర్నలిస్ట్ రచయిత రాకా సుధాకర్ విచ్చేయుచున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా వందేమాతరం పూర్తి గీతాన్ని ఆలపించడం జరుగుతుందని తెలిపారు.
స్వతంత్ర పోరాటంలో ప్రాణాలను,జీవితాలను త్యాగం చేసిన వీరనారీమణుల చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారు వివేకానందునికి నివాళులు అర్పించడానికి పూలు తీసుకొని రావాలని కోరారు.అందరిలో ఒకే భావన,ఒకే ఆలోచన కలిగించడానికి పురుషులు తెల్లటి చొక్కాను,మహిళలు ఎరుపు రంగు దుస్తులను ధరించి రావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ నేట్ల మహేశ్వర్ రెడ్డి , గెలివి శ్రీకాంత్ ,డాక్టర్ సంతోష్ , వల్లం కొండ సంపత్ , భవనాసి లక్ష్మీనారాయణ , యాదవ్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి , భవాని సింగ్ , చాటకొండ శ్రీకాంత్, రాంప్రసాద్, డాక్టర్ ఉదయ్ శంకర్ పాల్గొన్నారు
Arattai