నంద్యాల పట్టణంలోని టెక్కేమార్కెట్ యార్డ్ నందు ఈనెల 12వ తేదీ ఉదయం 9 గంటలకు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నారు.సంక్రాంతి పండుగ సందర్భంగా సంస్కృతి,సాంప్రదాయాలను బలోపేతం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్ నంద్యాల నగర అధ్యక్షురాలు సుహాసిని రెడ్డి తెలిపారు.
మొదటి బహుమతి5వేలురెండవ బహుమతి 3వేలు, మూడవ బహుమతి 2వేలు,పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులను అందజేస్తున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు సుహాసిని రెడ్డి,విశ్వహిందూ సహకార్యదర్శి సిరిగిరి కృష్ణ ,మాతృశక్తి విభాగ్ కోవెలకుంట్ల దేవి ,బజరంగ్ దళ్ సంయోజక్ మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు
Arattai