NANDYAL JAN 16:- నంద్యాల పట్టణం విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో ఈనెల 18న ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు.విశ్వహిందూ పరిషత్ సేవా విభాగం ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు VHP నంద్యాల నగర అధ్యక్షులు చంద్రశేఖర్ తెలిపారు.ప్రముఖ దంత వైద్యులు విజయలక్ష్మి ఈ శిబిరంలో వైద్య సేవలు అందిస్తారని పేర్కొన్నారు.పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఈ ఉచిత దంత వైద్య శిబిరాన్ని సద్విని చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ సభ్యులు వెంకటసుబ్బయ్య సుబ్బారెడ్డిలు పాల్గొన్నారు
I’m Vasu, a journalist with 20 years of experience, now bringing you news through Nandi News.
Arattai