ఏకశిలా హనుమాన్ కి మౌని అమావాస్య పూజలు
NANDYAL JAN18 :- నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం పెద్ద దేవలాపురాణం నందు వెలసిన ఏకశిలా అభయాంజనేయ స్వామికి ఎవరు మౌని అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉదయం నుండి ఏకశిలా అభయాంజనేయ స్వామికి ఆకుపూజలు,ప్రత్యేక పూజలు నిర్వహించామని,రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు రాత్రి రెండు గంటలకు మహా మంగళహారతి ఉంటుందని ఆలయ నిర్వహకులు శివరాజ్ యోగి,రవితేజ లు తెలిపారు.ప్రతి నెల అమావాస్య రోజున ఏక శిల అభయాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటామని, పరిసర ప్రాంత గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు
Arattai