NANDYAL JAN23: నంద్యాల పట్టణంలో శుక్రవారం బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
సరస్వతీ పూజ ,సరస్వతి హోమము పురోహితుడు శ్రీ సుధింద్ర చార్యులు చే నిర్వహించారు.వివిధ స్కూళ్ళకు సంబంధించిన పదవ తరగతి విద్యార్థినీ విద్యార్థులు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. విద్యార్థిని విద్యార్థులకు కంకణములు మరియు కలములను SBI డి శ్రీధర్ శర్మగారు ఉచితముగాఅందజేశారు.

అధ్యక్షుడు శ్రీ P.కేశవ మూర్తి మాట్లాడుతూ నంద్యాలలోని పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు అందరూ ఉత్తమ శ్రేణులలో ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షిస్తూ అలాగే ఉచితంగా అక్షరా భ్యాస కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ, ఉద్యా సాయినాథ్ ,నాగేంద్ర ,రామచంద్ర మూర్తి,హెగ్డే సత్యనారాయణ,కాదంబిని ప్రశాంతి, శైలజ, హిమబిందు కళ్యాణి మంజుల తదితరులు పాల్గొన్నారు.విద్యార్థులందరికీ ప్రసాద వితరణ జరిగింది.

Arattai