ప్రాజెక్ట్ డిజైన్ కెపాసిటీని మించి తొలిసారి నీటిని డ్రా చేసిన హంద్రీ-నీవా ప్రాజెక్ట్.
హంద్రీ-నీవా ప్రాజెక్టు నుంచి కేవలం 190 రోజుల్లోనే 40.109 టీఎంసీల మేర నీటిని కాల్వలకు మళ్లించిన ఇరిగేషన్ శాఖ.
190 రోజుల్లో 40.109 టీఎంసీల నీటిని రాయలసీమ జిల్లాలకు చెందిన రిజర్వాయర్లు, చెరువులకు మళ్లించిన అధికారులు.
2014-19 మధ్య కాలంలో టీడీపీ హయాంలోనే 1 పంపు నుంచి 6 పంపుల ద్వారా నీటిని డ్రా చేసేలా సామర్థ్యం పెంపు.
మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చాక 12 పంపుల ద్వారా నీటిని తోడేందుకు సామర్థ్యాన్ని పెంచేలా పనులు.
12 పంపుల ఏర్పాటుతో పాటు… వంద రోజుల్లో కాల్వల వెడల్పు పనులను రికార్డు స్థాయిలో పూర్తి చేసిన ప్రభుత్వం.
హంద్రీ-నీవా విస్తరణ పనులను త్వరితగతిన చేపట్టి… సీమ ప్రాంతానికి నీళ్లందించేలా కృషి చేసిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాస్.
గురువారం నాటికి ప్రాజెక్ట్ డిజైన్ కెపాసిటీని మించి 40.109 టీఎంసీల నీటిని డ్రా చేసి రికార్డ్ సృష్టించామని సీఎంతో చెప్పిన మంత్రులు పయ్యావుల, బీసీ జనార్దన్ రెడ్డి.
హంద్రీ-నీవా ప్రాజెక్టును పూర్తి స్థాయిలో సద్వినియోగమయ్యేలా ప్రణాళికతో సీఎం వ్యవహరించారన్న మంత్రి పయ్యావుల.
రాయలసీమ ప్రాంతంలోని అన్ని రిజర్వాయర్లను, చెరువులను నీటితో నింపాలన్న ముఖ్యమంత్రి.
చివరి ఎకరా వరకు నీళ్లందించాలని.. సీమ ప్రాంతాన్ని సస్య శ్యామలం చేసేలా పని చేయాలన్న సీఎం చంద్రబాబు.
హంద్రీ-నీవా నుంచి 50 టీఎంసీల మేర నీటిని డ్రా చేసి మరో రికార్డు సృష్టించాలని మంత్రి నిమ్మలకు సీఎం చంద్రబాబు ఆదేశం.
ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి తొలివారంలోగా 50 టీఎంసీల నీటిని హంద్రీ-నీవా కాల్వల నుంచి రాయలసీమ జిల్లాలకు తరలించేలా చర్యలు తీసుకుంటామని సీఎంకు వివరించిన మంత్రి నిమ్మల.
Arattai