VELUGODU Jan23:రాష్ట్ర ST కమీషన్ సభ్యులు, వెంకటపతి రాష్ట్ర గిరిజన సలహామండలి సభ్యులు. ఈ రోజు నంద్యాల జిల్లా వెలుగోడు విజయ దుర్గ చెంచు గూడెం నందు సందర్శించడం జరిగింది అందులో భాగంగా శ్రీ వెంకట శివప్రసాద్ ప్రాజెక్టు ఆఫీసర్ ఐటీడీఏ శ్రీశైలం వారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ సభ్యులు పి వెంకటప్ప, ఆంధ్రప్రదేశ్ గిరిజన సలహా మండలి సభ్యులు వెంకటపతి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలాగున చూడాలని అలాగే వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి చెంచులు అందరికి కూడా వారి సమస్యలను విని వెంటనే అధికారులకు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగినది

ముఖ్యంగా వెలుగోడు చెంచుగూడెం కు 40 లక్షలతో సిసి రోడ్డు మంజూరు చేయించడం జరిగినది అలాగే గృహాలకు సంబంధించి పి ఎం జన్మాన్ ద్వారా 45 గృహాలను మంజూరు కావాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగినది వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టించే బాధ్యత ఐటిడిఏ/ హౌసింగ్ శాఖల సమన్వయంతో ఇల్లు పూర్తి చేస్తామని చెప్పడం జరిగినది. ప్రతి ఒక్క చెంచుగూడెం లో కూడా మౌలిక వసతుల కల్పన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలాగున కూటమి ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్క గిరిజనులు కూడా సంక్షేమ పథకాల అందాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడం జరిగినది.

ప్రతి మనిషికి ముఖ్యంగా ఆధార్ కార్డు అనేటువంటిది చాలా ముఖ్యము ఆధార్ కార్డు లేని వారికి వెంటనే ఆధార్ కార్డు తీపించాలి పుట్టిన తేదీ సర్టిఫికెట్లు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి మరియు వారంలో ఒకరోజు ప్రతి ఒక్క మండల స్థాయి అధికారి కూడా చెంచుగూడెంలను సందర్శించి వారి సమస్యలను తెలుసుకొని శాఖల సమన్వయంతో పరిష్కరించాలని అధికారులకు ఆదేశించడం అయినది . వివిధ చెంచుగూడెంలో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యలు కూడా పరిష్కరిస్తామని చెప్పడం జరిగినది. ప్రస్తుతానికి వెలుగోడు విజయదుర్గ చెంచు కాలనీ లోని 45 కుటుంబాలకు తార్పాలిన్ పట్టలు పంపిణీ చేయడం జరిగినది
ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి గారు పీఎం గారు ఏపీడి ఐటీడీఏ గారు ఆత్మకూరు, వెలుగోడు, బండి ఆత్మకూరు మండల స్థాయి అధికారులు, ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాగిరి చంద్రప్ప, చెంచు సంఘం నాయకులు హుస్సేనమ్మ,నారాయణమ్మ, సుగాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు గుండాల నాయక్, టి ఎస్ ఎఫ్ నాయకులు వెంకటేష్ అంజి నాయక్ లోకనాయక్ రాము నాయక్, ఎరుకుల సంఘం నాయకుడు పెద్ద ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.
Arattai