NANDYAL Jan26 :- 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని శ్రీనివాస్ నగర్ లో ఉన్న వందే మార్ట్ ( వి మార్ట్) ఆధ్వర్యంలో,వందే మార్ట్ నిర్వాహకులు చంద్రశేఖర రెడ్డి, మల్లికార్జున రెడ్డి, రాఘవేంద్రల నిర్వహణలో, విజయ బ్లడ్ బ్యాంక్ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ జాతీయ పతాకావిష్కరణ చేసి రక్తదాన శిబిరం ప్రారంభించారు.

ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలలో జాతీయ పతాక ఆవిష్కరణతో పాటు రక్తదాన శిబిరం నిర్వహించడం ప్రశంసనీయమని నిర్వాహకులను అభినందించారు.

వందే మార్ట్ నిర్వాహకులు మల్లికార్జున రెడ్డి, రాఘవేంద్ర లు మాట్లాడుతూ తమ సూపర్ మార్కెట్ల వద్ద ప్రతి ఏటా స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహించడంతోపాటు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి తమ ఉద్యోగులు రక్తదానం చేస్తున్నామన్నారు. 2026 వ సంవత్సరం రిపబ్లిక్ దినోత్సవం పురస్కరించుకుని తమ వందే మార్ట్ సూపర్ మార్కెట్ లలో 5000 రూపాయల పైగా విలువ చేసే వంటగది వస్తువుల సెట్ 2026 రూపాయలకే ప్రజలకు అందించామని తెలిపారు.

రక్తదాన శిబిరంలో 40 మంది దాతలు రక్తదానం చేశారు. వారికి పండ్లు, బ్లడ్ బ్యాంక్ తరఫున ప్రశంసా పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో వందే మార్ట్ నిర్వాహకులు చంద్రశేఖర రెడ్డి, మల్లికార్జున రెడ్డి, రాఘవేంద్ర, భరత్ కుమార్ రెడ్డి, గణేష్ రెడ్డి, ఎల్లారెడ్డి,విజయ బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు రహమతుల్లా, రక్తదాన శిబిర నిర్వాహకులు దాదా నజీర్, సద్దాం, వందే మార్ట్ సిబ్బంది పాల్గొన్నారు.
Arattai