నంద్యాల ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానంలో అభివృద్ధి పనులకు బుధవారం భూమి పూజ నిర్వహించినట్టు దేవస్థానం చైర్మన్ చలం బాబు తెలిపారు.

ప్రధమనందీశ్వర స్వామి దేవస్థానం ఆవరణంలోని అన్నప్రసాద వితరణ ప్రాంగణంలో నూతనంగా 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో షెడ్డు నిర్మాణం కోసం బుధవారం పూజా కార్యక్రమాలు నిర్వహించి ఐరన్ స్తంభాలు నిలబెట్టడం జరిగింది

ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యాసంస్థల అధినేత రామకృష్ణారెడ్డి ఏ వి ఆర్ కళాశాల అధినేత వెంకట్రాంరెడ్డి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడుసిద్ధం శివరాం 12వ వార్డ్ కౌన్సిలర్ శ్యాంసుందర్ లాల్ ఆర్యవైశ్య జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు శ్యాంసుందర్ గుప్తా భూపనపాడు సంజీవ్ కుమార్. అన్న ప్రసాద వితరణ సమితి సభ్యులు రామశివారెడ్డి ఆచారి మహారాజ్ శేఖర్ రెడ్డి నారపరెడ్డి ఈశ్వర్ రెడ్డి యుగంధర్ రెడ్డి బొల్లెద్దుల నరసింహులు నిమ్మకాయ ల సుధాకర్ దేవస్థానం అధికారి చంద్రుడు కూరగాయల వ్యాపారి ప్రసాద దేవాస్థానం కమిటీ చైర్మన్ చలం బాబు సభ్యులు కృష్ణారెడ్డి రాంపుల్లయ నాగరాజు మనిషా తదితరులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మరియు సంజీవ కుమారులు షెడ్డు నిర్మాణానికి వారి వంతు సహాయ సహకారాలు అందించారు.మార్చి నెల లో వచ్చేటువంటి సంకట చతుర్థి రోజున న వినాయక స్వామి పూజలు మొదలు చేస్తామని ప్రధమ నందీశ్వర స్వామి దేవస్థానంలో సంకట చతుర్థి పూజలు చేసే మహిళలకు పూజలు అనంతరం అన్న ప్రసాద సమితి ఆధ్వర్యంలో అల్పాహార వితరణ కార్యక్రమం ఉంటుందని దేవస్థానం చైర్మన్ చలం బాబు తెలిపారు

Arattai