నంద్యాల పట్టణ శివారులోని శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాల (స్వయం ప్రతిపత్తి), లో “మెషిన్ లెర్నింగ్ మరియు డీప్ లెర్నింగ్‌ను ఉపయోగించి రియల్-టైమ్ డేటా ఆధారిత అప్లికేషన్ అభివృద్ధి.” అంశంపై వన్ వీక్ వర్క్‌షాప్ మరియు హ్యాకథాన్ కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.వి. సుబ్రహ్మణ్యం ప్రారంభిస్తూ మాట్లాడుతూ, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతికతలు విద్యార్థుల ఉద్యోగావకాశాలను విస్తరించడంతో పాటు దేశ అభివృద్ధికి కూడా దోహదపడతాయని తెలిపారు. అంతేకాకుండా ఇలాంటి హ్యాండ్స్-ఆన్ శిక్షణ కార్యక్రమాలు విద్యార్థులలో ఆవిష్కరణాత్మక ఆలోచనలను పెంపొందిస్తాయని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (డేటా సైన్స్) విభాగాధిపతి డా. ఎన్. రమాదేవి గారి మార్గదర్శకత్వంలో, ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎస్. సాదియా ఫాతిమా సమన్వయంతో నిర్వహించబడింది. ఈ సందర్భంగా డా. ఎన్. రమాదేవి మాట్లాడుతూ, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే ఈ వర్క్‌షాప్ లక్ష్యమని, రియల్‌టైమ్ ప్రాజెక్టుల ద్వారా విద్యార్థులకు ప్రాక్టికల్ అనుభవం లభిస్తుందని తెలిపారు.

డాటావ్యాలీ సంస్థ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో ఇండస్ట్రీ నిపుణులు కుమారి విజయలక్ష్మి గంగుల మరియు కుమారి వై.ఎస్. సత్య సోమ్య పల్లా ముఖ్య వక్తలుగా పాల్గొని, రియల్‌టైమ్ డేటా ఆధారిత అప్లికేషన్ అభివృద్ధిపై శిక్షణ అందించారు. ఈ వర్క్‌షాప్‌ను IEEE స్టూడెంట్ బ్రాంచ్ STB17901 మరియు IEEE కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్ సొసైటీ SBC17901F ఆధ్వర్యంలో నిర్వహించగా, III బీటెక్ CSE (డేటా సైన్స్) విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Arattai