బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించిన ప్రతిభాన్వేషణ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. ఆదివారం ప్రధమనంది సమీపంలోని గాయత్రి మాత ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ పరీక్షలకు నంద్యాల పట్టణం మరియు సమీప గ్రామ ప్రాంతాల నుండి 100 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు
సమాఖ్య గౌరవాధ్యక్షులు కాదర్ బాద్ రవీంద్రనాథ్, అధ్యక్షులు కేశవమూర్తి, కార్యదర్శి సుధీoద్రాచార్యులు, సమాఖ్య నాయకులు హెగ్డే సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ నిర్వహించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు వేరువేరుగా నగదు బహుమతులు అందజేశామన్నారు…. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో నంద్యాల ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థిని “ముబీనా “ప్రథమ స్థానం, యల్లావత్తుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి రోహన్ శ్రీనివాస్ ద్వితీయ స్థానం, ఆదర్శ పాఠశాల పాణ్యం, విద్యార్థి మహేంద్ర తృతీయ స్థానం సాధించి వరుసగా మూడు వేలు, రెండు వేలు , వెయ్యి రూపాయలు నగదు బహుమతులు అందుకున్నారు

అలాగే ప్రైవేట్ పాఠశాల విభాగంలో గుడ్ షెఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని సాయి శ్రీ నిధి ప్రథమ స్థానం, శ్రీ లక్ష్మీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థి ధరణి రోహిత్ ద్వితీయ స్థానం, కేశవరెడ్డి స్కూల్ బాలాజీ కాంప్లెక్స్ విద్యార్థి చర్విత్ తృతీయ స్థానం కైవసం చేసుకున్నట్లు వారు తెలిపారు… అలాగే వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సాల్మన్, సలీమా, సహస్ర, సుమయ, రిహాన్ కు ప్రోత్సాహక బహుమతులు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు…. విద్యార్థులలోని ప్రతిభను వెలికి తీసి ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో పదవ తరగతి విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించినట్లు సమాఖ్య అధ్యక్షులు కేశవమూర్తి పేర్కొన్నారు..
బహుమతి సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో పోటీపరీక్షల్లో ప్రతిభావంతంగా రాణించి విజయాలు సాధించాలని నిర్వాహకులు కోరారు. “సహాయ”రూరల్ డెవలప్ మెంట్ సొసైటీ తరపున పరీక్ష నిర్వహణకు సహకారం అందించిన ఉపాధ్యాయులు రవీంద్రా రెడ్డి ని సమాఖ్య నాయకులు ప్రత్యేకంగా అభినందించారు. అలాగే కార్యక్రమ నిర్వహణ, మూల్యాంకనంలో సహకరించిన ఉపాధ్యాయులు సుందరరావు, శేషఫణి , వరాహమయ్య ,వేణుమాధవ్, నాగేశ్వరరావు సుబ్రహ్మణ్య శాస్త్రి ,హరికృష్ణ ,సంతోష్ తదితరులను కార్యక్రమ కన్వీనర్ హెగ్డే సత్యనారాయణ అభినందించారు..
Arattai