NANDYAL Mar02:- భారతీయ వైద్య సంఘం నంద్యాల శాఖ ఆధ్వర్యంలో, నంద్యాల ఐఎంఏ ముస్లిం వైద్యుల నిర్వహణలో పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని ఇఫ్తార్ విందు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ఐఎంఏ నంద్యాల కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ నిర్వహణలో ఉపవాస దీక్ష విరమణ, తదుపరి మౌలానా అబ్దుల్ హాది ఆధ్వర్యంలో ప్రార్ధనలు నిర్వహించారు. ఉపవాసం పాటిస్తున్న వైద్యులు, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఐఎంఏ కేంద్ర కమిటీ సభ్యులు డాక్టర్ రవి కృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన రెడ్డి ఇందులో పాల్గొన్నారు.
తదుపరి ఇఫ్తార్ విందు సమావేశంలో రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ముఖ్యఅతిథిగా, నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గౌరవ అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాల పట్టణం మతసామరస్యానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.తెలుగుదేశం పార్టీ లౌకిక తత్వానికి కట్టుబడి ఉందని అన్నారు.ఐఎంఏ వైద్యులు హిందూ పర్వదినాలు, క్రిస్మస్, రంజాన్ ఇఫ్తార్ సమావేశాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇది ఐక్యతకు, సంఘీభావానికి దోహదం చేస్తుందన్నారు. నంద్యాల వైద్యులు సేవా దృక్పథం కలిగిన వారని అభినందించారు. వారి సమస్యల పరిష్కారానికి సహకారం అందజేస్తామన్నారు.

తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నంద్యాలలో హిందూ ముస్లిం ఐక్యత కోసం తాము ఎల్లప్పుడూ ముందుంటామని అన్నారు.
డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ ఐఎంఏ ఆధ్వర్యంలో నంద్యాల వైద్యులు సంక్రాంతి, ప్రీ క్రిస్మస్, రంజాన్ ఇఫ్తార్ సమావేశాలు ఆనవాయితీగా చేస్తున్నామని, ఇది మతసామరస్యానికి, భిన్నత్వంలో ఏకత్వం కొనసాగించడానికి దోహదం చేస్తాయని అన్నారు. నంద్యాలలో మతసామరస్యం కొనసాగడానికి మంత్రి ఫరూక్ కృషి మరువలేమన్నారు.

సీనియర్ వైద్యులు డాక్టర్ జఫరుల్లా, ఐఎంఏ నంద్యాల కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ నంద్యాల వైద్యులు ఐకమత్యంతో ఉండి ప్రజలకు మంచి సేవలు అందించడంలో ముందున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ ఖలీల్ మనీయార్, తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా వైద్యుల విభాగం అధ్యక్షులు డాక్టర్ మధుసూదన రెడ్డి, రాష్ట్ర ఐఎంఏ సంయుక్త కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్, డాక్టర్ మధుసూదన రావు,సీనియర్ వైద్యులు డాక్టర్ బాబన్, డాక్టర్ మహమ్మద్ హుస్సేన్, డాక్టర్ జఫరుల్లా, డాక్టర్ మహమ్మద్ రఫీ, డాక్టర్ మహబూబ్ బాషా, డాక్టర్ జహంగీర్,డాక్టర్ మహమూద్, డాక్టర్ హషమ్, డాక్టర్ మహ్మద్ రఫీ,డాక్టర్ ఆర్షద్, పెద్ద స్వామి, డాక్టర్ షబ్నం,డాక్టర్ అరిఫా భాను, డాక్టర్ జాస్మిన్ సుల్తానా, డాక్టర్ ఫాతిమా బి, డాక్టర్ చరిష్మా, ఫర్హీన్, నంద్యాల మహిళా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి, అధిక సంఖ్యలో వైద్యులు ముస్లిం ప్రముఖులు పాల్గొన్నారు.
Arattai