NANDYAL ;- నంద్యాల పట్టణంలోనిPSC&KVSC ప్రభుత్వ కళాశాల మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంను నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ శశికళ అధ్యక్షత వహించారు. ICDS సిబ్బంది నూర్జహాన్ మరియు జయలక్ష్మమ్మ పాల్గొన్నారు.
కార్యక్రమంలో మహిళల సాధికారత, సమాన హక్కులు మరియు సమాజ అభివృద్ధిలో మహిళల కీలక పాత్ర గురించి ప్రసంగాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అన్ని రంగాల్లో గొప్ప విజయాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , అంతరిక్ష శాస్త్రవేత్త కల్పనా చావ్లా , మరియు అంతర్జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు వంటి మహిళలను ఉదాహరణగా ప్రస్తావిస్తూ మహిళల విజయాలను గుర్తుచేశారు. మహిళల కృషి, త్యాగాలు మరియు విజయాలను గుర్తుచేసారు. మహిళల సాధికారతపై అవగాహన కల్పిస్తూ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది.

ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ప్రిన్సిపల్ మేడమ్ గారిని ఉపాధ్యాయులు సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా విద్యార్థునులకు పోటీలు నిర్వహించారు,విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గారు, అధ్యాపక సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Arattai