NANDYAL :- స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ సమగ్ర శిక్ష అమరావతి వారి ఆదేశాల మేరకు మార్చి 4 వ తేదీ నుండి 6తేదీ వరకు, పాఠశాల స్థాయి మండల స్థాయి వారోత్సవాలు జరిగాయి. మంగళవారం జిల్లా విద్యాశాఖాధికారి పి.జనార్ధన రెడ్డి ఆదేశాల మేరకు విజ్ఞాన వారోత్సవాలు – 2026 కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన వివిధ శాస్త్ర సంబంధిత పోటీలు ఈరోజు జిల్లా స్థాయిలో ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమం నంద్యాలలోని ఎస్ పి జి హై స్కూల్ వేదికగా ఉదయం 9.30 గంటల నుండి ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖాధికారి పి.జనార్దన్ రెడ్డి గారు మరియు డోన్ డిప్యూటీ ఈఓ వెంకటరామిరెడ్డి గారు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
విజ్ఞాన వారోత్సవాలలో భాగంగా ఇండియన్ స్పేస్ టెక్నాలజీపై పోస్టర్ ప్రెజెంటేషన్, విమెన్ ఇన్ సైన్స్ అంశంపై క్విజ్ పోటీ, సైన్స్ & టెక్నాలజీపై డిబేట్, సైన్స్ ఇన్ ఎవరీడే లైఫ్ అంశంపై సెమినార్, శాస్త్రవేత్తల వేషధారణ (ఫ్యాన్సీ డ్రెస్) వంటి విభిన్న పోటీలు నిర్వహించబడ్డాయి. ఈ పోటీలలో జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల నుండి 4వ తరగతి నుండి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుల కోసం కూడా ప్రత్యేకంగా పోస్టర్ ప్రెజెంటేషన్, క్విజ్, డిబేట్, సెమినార్ మరియు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించడం విశేషం. పోటీలలో విజేతలైన విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు ముఖ్య అతిథులు బహుమతులు అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి పి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, పరిశోధనా ఆసక్తి పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.కార్యక్రమ నిర్వహణలో జిల్లా సైన్స్ అధికారులు కరణం సుందరరావు (DSO), కె.వి. సుబ్బారెడ్డి జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ , C. చంద్రశేఖర్ రెడ్డి ఎన్జిసి కోఆర్డినేటర్ , జి. నాగేంద్ర కుమార్ దీక్ష కోఆర్డినేటర్, ఆర్గనైజర్లు శేషపాణి, అన్నెం శ్రీనివాసరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, శివ నాగేంద్రుడు,వివిధ పాఠశాల హెడ్మాస్టర్లు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Arattai