NANDYAL Mar 21 :- ఒరిస్సాలోని భువనేశ్వర్ లో 18 నుండి 21 వరకు జరుగుచున్న 24వ జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో నంద్యాల జిల్లా,రుద్రవరం గ్రామానికి చెందిన గౌతమ్ రజత పతకం సాధించినట్లు జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ,కార్యదర్శి రమణయ్య తెలిపారు.F -41 కేటగిరీ షాట్ పుట్ లో రజత పతకం సాధించడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని వారు తెలిపారు.జిల్లాలోని ప్రముఖులు గౌతమ్ కు అభినందనలు తెలిపారు

ఈ సందర్భంగా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గోనుగుంట్ల కోటేశ్వరరావు,స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ అనిమిని రవి నాయుడు,స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ S.భరణి, గౌతమ్ కి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసి, భవిష్యత్తులో ఇంకా ఎన్నో విజయాలు సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
Arattai