NANDYAL April 03:- నంద్యాల పట్టణంలో ఆర్.జే.యు.పీ.(RJUP) రాష్ట్ర కార్యదర్శి అన్నెం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన శుక్రవారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు.11వ పీఆర్సీ కాలం ముగిసి 33నెలలు గడచిపోయినా, ఇంతవరకు కనీసం 12వ పీఆర్సీ కమీషన్ ను నియమించక పోవడం పట్ల ఉపాధ్యాయులు ఆందోళనలో ఉన్నారని తక్షణం పీఆఆర్సీ కమీషన్ ను నియమించాలని “రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్” రాష్ట్రప్రధానకార్యదర్శి ఎస్.ఎం.షరీఫ్ కోరారు. శుక్రవారం స్థానిక నంద్యాలలోని సంఘ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి అన్నెంశ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లాకార్యవర్గ సమావేశంలో షరీఫ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 22నెలలు దాటినా ఎన్నికల హామీ మేరకు పీఆర్సీ నియమించలేదని,పెండింగ్ డీ.ఏ. లలో కేవలం ఒక్క టి మాత్రమే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పథకాలను విజయవంతం గా అమలు చేసే ఉద్యోగ,ఊనాధ్యాయులు కూడా ప్రజలో భాగమేనని ఐ.ఆర్ . ప్రకటించి, డీ.ఏ.లు చెల్లించాలన్నారు. రాష్ట్ర అధికారప్రతినిధి ముత్తోజు వీరబ్రహ్మం మాట్లాడుతూ రిటైర్ అయిన వారికి ఆపిన గ్రాట్యూటీ, ఈ.ఎల్. ఎన్ క్యాష్ మెంట్ వెంటనే చెల్లించి, పెన్షనర్లకు ఆర్ధిక బకాయిలు చెల్లించాలన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులు కలసికట్టుగా పోరాడి, హక్కులు సాధించుకోవలసిన అవసరముందన్నారు.
రాష్ట్ర ఉపాధ్యక్షులు శేషఫణి, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ ఉపాధ్యాయులు నీలం వెంకటేశ్వర్లు, లింగమయ్య, హుస్సేన్ మియ్య, నబి సాహెబ్ శివయ్య,ఆధ్యాపకులు రఫీ, బాలసుబ్బయ్య, నీలకంఠమాచారి తదితరులు పాల్గొన్నారు.
Arattai