NANDYAL April 12 :- ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నంద్యాల కు చెందిన సాహితీవేత్త వైష్ణవ వెంకట రమణమూర్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉగాది పురస్కారం స్వీకరించిన సందర్భంగా కళారాధన సాంస్కృతిక సంస్థ కార్యాలయంలో కళారాధన, నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్తంగా ఘనంగా సత్కరించారు.
నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు అధ్యక్షతన, మాతృభాషా పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నెం శ్రీనివాసరెడ్డి నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది వెదుర్ల రామచంద్రరావు, కళారాధన వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుర్రాల రవికృష్ణ పాల్గొని రమణమూర్తిని శాలువా జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా వెదుర్ల రామచంద్రరావు మాట్లాడుతూ రమణమూర్తి చేసిన విశిష్ట సాహితీ సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారం ప్రకటించడం హర్షణీయమన్నారు. రమణమూర్తి అనేక కావ్యాలు రచించడమే కాకుండా పద్య సాహిత్య ప్రాచుర్యానికి చేసిన సేవలు విశిష్టమైనవనీ ప్రశంసించారు.

డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ రమణమూర్తి చిన్నయ్య సూరి సాహితీ సంస్థ ద్వారా తెలుగు సాహిత్య ప్రాభావానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఉగాది, కళా రత్న పురస్కారాలు గత సంవత్సరం నుండి కూటమి ప్రభుత్వం పునరుద్ధరించడం పట్ల రాష్ట్రంలోని కళాకారులు సాహితీవేత్తలు, హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వివిధ రంగాల సేవలను గుర్తించి ఈ పురస్కారాలు అందించడానికి నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ లకు ధన్యవాదాలు తెలిపారు.

తెలుగు కవులు నరేంద్ర, డాక్టర్ నీలం వెంకటేశ్వర్లు రమణమూర్తి సాహితీ సేవలను ప్రస్తుశిస్తూ కవితా గానం చేశారు.రమణమూర్తి మాట్లాడుతూ తెలుగు పద్యం ప్రాచుర్యానికి తన జీవితమంతా కృషి చేయడం జరిగిందని, తన రచనల పైన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం పరిశోధన గ్రంథం రూపొందిస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, రీజియన్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, జోన్ చైర్మన్ నిజాముద్దీన్,ఇమ్మడి రామకృష్ణ,సాహితీ స్రవంతి అధ్యక్షులు శ్రీనివాసమూర్తి, కార్యదర్శి డాక్టర్ నీలం వెంకటేశ్వర్లు, మాతృభాషా పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నెం శ్రీనివాస్ రెడ్డి, ఐఎంఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్,నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎం.పీ.వి. రమణయ్య,ప్రముఖ తెలుగు కవులు, అధ్యాపకులు అవ్వారి శేష ఫణి,డాక్టర్ కురుమేటి కిషోర్, నరేంద్ర, నీలకంఠమాచారి, కొప్పుల ప్రసాద్, మహమ్మద్ రఫీ, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Arattai