NANDYAL April 13:- ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు, ఆసుపత్రి పరిసరాల్లో భద్రతా మరియు పారిశుధ్య పరిస్థితులను మరింత బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ఛాంబర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతుల కల్పన మెరుగల వైద్య సేవలు అందించేందుకు పరికరాలు సంబంధిత అంశాలపై వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.జిలానీ, డిసిహెచ్ఎస్ డా.ఓ.లలితా, డిఎంహెచ్ఓ డా.వెంకటరమణ, ఏపీఎంఎస్ఐడిసి ఇంజనీర్లు నరసింహారెడ్డి జయరాంరెడ్డి, ఎడి మస్తాన్, డ్రగ్ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందజేయాలని వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. హాస్పిటల్లో ఉన్న ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు మరియు ఎయిర్ కండీషనర్లను వినియోగంలోకి తీసుకురావాలన్నారు. సిఎస్ఆర్ (CSR) నిధుల కింద ఎన్ని పరికరాలను మరమ్మతు చేయించవచ్చో, అలాగే జిల్లా ఖనిజ నిధి (DMF) ద్వారా ఎన్ని రిపేర్ చేయించవచ్చో పరిశీలించాలని జిజిహెచ్ సూపరింటెండెంట్ ను ఆదేశించారు. ఏసీల వార్షిక నిర్వహణ ఒప్పందం (AMC) విలువ రు.4.5 లక్షలు కాగా, గత ఏడాది సుమారు రు.10 లక్షలు ఖర్చు చేసినట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు. ఆసుపత్రి వెనుక భాగంలో ప్రహరీ గోడ నిర్మించి, బలమైన గేటును ఏర్పాటు చేయాలని సూచించారు. అదనంగా భద్రత దృష్ట్యా సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రి ఆవరణలో వీధి కుక్కల సమస్యపై చర్చిస్తూ, వాటిని పట్టుకుని స్టెరిలైజేషన్ చేసి, నిబంధనల ప్రకారం తిరిగి అదే ప్రదేశంలో వదిలివేయాలని తెలిపారు. బయటి వ్యక్తులు ఆసుపత్రిలోకి వచ్చి అనధికారికంగా ఉండడాన్ని సెక్యూరిటీ సిబ్బంది కఠినంగా నిరోధించాలని స్పష్టం చేశారు.
వైద్య సేవల పరంగా, మందుల కొనుగోలు ప్రక్రియ సెంట్రల్ ఆఫీస్ అనుమతులతో ఆన్లైన్ ద్వారా జరుగుతోందని వివరించారు. నెఫ్రోప్లస్ విభాగంలో వైద్యుల హాజరు సమస్యపై వచ్చే సోమవారం కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. సంబంధిత వైద్యులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. ఇతర మౌలిక సదుపాయాల విషయానికి వస్తే, ప్రహరీ గోడ నిర్మాణానికి సుమారు రూ.10 లక్షలు వ్యయం అవుతుందని అంచనా వేశారు. నిధుల కొరత దృష్ట్యా తాత్కాలికంగా ఇనుప గ్రిల్స్‌కు గ్రీన్ షీట్ ఏర్పాటు చేయాలని సూచించారు. రు. 6.5 లక్షల వ్యయంతో నిర్మాణంలో ఉన్న నీటి సంపు పనులు మరో 10 రోజుల్లో పూర్తవుతాయని, అనంతరం సంబంధిత అధికారులు కలెక్టర్ కు నివేదించారు. ఆసుపత్రి సేవల్లో నిర్లక్ష్యం కనబరిస్తే సంబంధిత విభాగాధిపతులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సేవల నాణ్యతపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తానని తెలిపారు.
Arattai