NANDYAL :-నంద్యాల ఉదయానంద మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి క్యాన్సర్ విభాగంలో క్యాన్సర్ శస్త్ర చికిత్సా నిపుణులుగా పనిచేస్తున్న ప్రముఖ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ వై నాగ సుదర్శన్ రెడ్డి, క్యాన్సర్ మెడికల్ స్పెషలిస్ట్ గా పని చేస్తున్న డాక్టర్ సుస్మిత లు , పట్టణ ప్రజలకు ఓపిడి సేవలు అందించాలని ఉద్దేశంతో పద్మావతి నగర్ మెయిన్ రోడ్డు లో మున్సిపల్ ఆఫీసు సమీపంలో, ఎమ్మెస్సార్ ఆసుపత్రి పక్కన సోమవారం “సుదర్శన్ సర్జికల్, క్యాన్సర్ కేర్ క్లినిక్ ” ను ఐఎంఏ జాతీయ కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఉదయానంద క్యాన్సర్ ఆసుపత్రిలో క్యాన్సర్ శస్త్ర చికిత్స నిపుణులు గా, లాప్రోస్కోపిక్ సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ వై. నాగ సుదర్శన్ రెడ్డి, క్యాన్సర్ మెడికల్ స్పెషలిస్ట్ గా పని చేస్తున్న డాక్టర్ సుష్మిత నంద్యాల ప్రజలకు పట్టణంలోనే అందుబాటులో సేవలు అందించాలనే ఉద్దేశంతో క్లినిక్ ప్రారంభించడం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. క్లినిక్ లో ప్రాథమిక దశలో క్యాన్సర్ లక్షణాలు గమనించడానికి ఆస్కారం ఏర్పడుతుందని తద్వారా ఉదయానంద క్యాన్సర్ ఆసుపత్రిలో వారికి అవసరమైన క్యాన్సర్ చికిత్సలు అందించడానికి ఈ క్లినిక్ దోహదపడుతుందన్నారు.
డాక్టర్ నాగ సుదర్శన రెడ్డి మాట్లాడుతూ క్యాన్సర్ ను ప్రాథమిక దశలో గుర్తిస్తే,శస్త్ర చికిత్సల ద్వారా, రేడియేషన్ థెరపీ, మెడికల్ థెరపీ చికిత్సలు ఏది అవసరమైతే అది అందివ్వడం ద్వారా క్యాన్సర్ బారి నుండి తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు. క్యాన్సర్ చికిత్సలు రాష్ట్ర ప్రభుత్వ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో పేదలకు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని అన్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉదయానందా ఆసుపత్రి డైరెక్టర్ లు పరమేశ్వర రెడ్డి, రామకృష్ణారెడ్డి,నంద్యాల వైద్యులు పాల్గొని డాక్టర్ నాగ సుదర్శన రెడ్డి డాక్టర్ సుష్మితులను అభినందించారు.
Arattai