NANDYAL May07:- కళారాధన సాంస్కృతిక సంస్థ నంద్యాల ఆధ్వర్యంలో, నంద్యాల ఐఎంఏ, మహిళా వైద్య విభాగం, నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్త సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత లలిత కళలు,క్రీడల వేసవి శిక్షణా శిబిరాన్ని స్థానిక కేఎన్ఎం పురపాలక పాఠశాల ఆవరణలో కళారాధన అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మధుసూదనరావు, డాక్టర్ రవి కృష్ణ, ఆంధ్రప్రదేశ్ లయన్స్ క్లబ్ ల సమాఖ్య మాజీ చైర్మన్ ఏ. వి.ఆర్. ప్రసాద్, కే.ఎన్.ఎం. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అసదుల్లా కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు.

కళారాధన అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు అధ్యక్షతన, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవి కృష్ణ, కార్య నిర్వాహక కార్యదర్శులు అన్నెం శ్రీనివాసరెడ్డి ,పత్తి రంగనాథ్, సాహితీ విభాగం కార్యదర్శి డాక్టర్ నీలం వెంకటేశ్వర్లు నిర్వహణలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కళారాధన అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు మాట్లాడుతూ ఈ సంవత్సరం మే 1వ తేదీ నుండి జూన్ 2 వ తేదీ వరకు “కళా సాధన- 2026” వేసవి శిబిరం నిర్వహించడం జరుగుతున్నదని, ఈరోజు లాంఛనంగా ప్రారంభించామన్నారు. వేసవి సెలవులను బాలలు, యువత సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.
ఏవిఆర్ ప్రసాద్ మాట్లాడుతూ కళలు, క్రీడలు బాలల మానసిక, వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయని తద్వారా చదువులో కూడా రాణించడానికి అవకాశాలు మెరుగవుతాయని అన్నారు. క్రమ శిక్షణ, ఏకాగ్రత మెరుగవుతాయని అన్నారు.ప్రధానోపాధ్యాయులు అసదుల్లా మాట్లాడుతూ కళారాధన గత 25 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఇంత చక్కటి కార్యక్రమం ఒక కళాయజ్ఞంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. బాలలకు వేసవి సెలవులు సద్వినియోగం చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం అన్నారు.
డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ శిక్షణ పొందిన బాలబాలికల చేత శిబిరం ముగింపు కార్యక్రమంలో ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. శిబిరంలో పాల్గొన్న అందరికీ ప్రశంసా పత్రం అందజేస్తామన్నారు. శిబిరంలో శిక్షణ పొందడానికి, ముగింపు ఉత్సవంలో ప్రదర్శనలు ఇవ్వడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరంలేదని తెలిపారు. ప్రదర్శనలకు అవసరమైనటువంటి కాస్ట్యూమ్స్, మేకప్ , లైటింగ్ సౌండ్ సిస్టం ఏర్పాట్లు అన్ని కూడా కళారాధన ఆధ్వర్యంలో చేస్తామన్నారు. కోచ్ లకు గౌరవ పారితోషికం అందజేస్తామన్నారు. కోచ్ లకు ప్రతిరోజు అల్పాహారం ఏర్పాటు చేశామని చెప్పారు.

ఈ సమావేశంలో కలయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, క్యాంప్ కోఆర్డినేటర్ లు మజీద్, వెంకటేశ్వర్లు ,కోచ్ లు గణేష్ ,కళ్యాణి, లలితా సరస్వతి, సుహాసిని, ప్రజ్వల,మానస,రజాక్ బాలరాజు,,శివకుమార్,సుదర్శనం,బాలకృష్ణ,నాగేంద్ర,రాజేంద్ర,సతీష్ ,మధు,సీతారాం,వెంకటరాజు,రాజ్ కుమార్,తరుణ్,నిలయ్,సాయి,సత్యనారాయణ, దామోదర్,సమీర్, ఫణి, శిక్షణ పొందుతున్న 350 మంది బాలబాలికలు, యువత, బాలల తల్లితండ్రులు పాల్గొన్నారు.
Arattai