NANDYAL May09 :-దళితుల భవిష్యత్ కోసం ఆనాడే డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్, బాబు జాగ్జీవన్ రామ్ లు పనిచేసి రాజ్యాంగం ద్వారా దళితులకు హక్కులు, రక్షణ కల్పించారని, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అంతరానితన నిర్ములనకు, దళితులకు పక్కాగృహాలు, సాగు భూమి అందించారని, దళితుల రక్షణకు ఎస్. సి. కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ దళిత, క్రైస్తవులకు స్వతంత్ర్య భారత దేశంలో తెలుగుదేశం పాలన దివంగత ఎన్ టీ ఆర్, విజనరీ లీడర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో న్యాయం జరిగిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు దళిత, క్రైస్థవుల అభ్యున్నతికి అంకితభావంతో పని చేస్తున్నారని, ఎస్. సి కార్పొరేషన్ ఏర్పాటు చేసి సాగుభూమి అందించారని, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ దళిత బిడ్డల ఉన్నత చదువులకు ప్రత్యేక నిధులు కేటాయించి ప్రోత్సాహిస్తున్నారన్నారు. మీ న్యాయమైన డిమాండ్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లుతానని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. నంద్యాల పార్లమెంట్ ఎన్నికల్లో దళిత, క్రైస్థవులు తన విజయానికి పూర్తి సహకారం అందించారని, మీ మేలు మరువలేనిది అన్నారు. పార్లమెంట్ దృష్టికి మీ సమస్య తీసుకొని వెళతానని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి హామీ ఇచ్చారు. పార్లమెంట్ పరిధిలో మీకు ఏ సమస్య ఉన్నా తనను సంప్రదించండని కోరారు. దళిత కుటుంబాలు అంటే బైరెడ్డి కుటుంబంకు ఎంతో గౌరవం అని, టీడీపీ ఎమ్మెల్యే గా ఉన్న మా నాన్న బైరెడ్డి రాజశేఖరరెడ్డి మా గ్రామ సమీపంలో ఉన్న సంకిరేణిపల్లె గ్రామ సభ వద్ద దీనంగా ఏడుస్తున్నా రెండేళ్ల బాలికను చూసి ఎవరి బిడ్డ అని మా నాన్న గ్రామస్థులను ఆరా తీయగా మా గ్రామ దళిత కాలనీ బిడ్డ ఇటీవల వారి అమ్మా, నాన్న చనిపోయారు అనగానే గ్రామస్థుల అనుమతితో ఆ ఆడపిల్లను మా ఇంటికి తీసుకొచ్చి, మాతో సమానంగా ఉన్నత చదువు అందించి, బెంగళూరులో ప్రముఖ ఐ టీ కంపెనీలో జాబ్ చేస్తూ, ఇటీవల ఘనంగా పెళ్లి చేశారని, సమానత్వంకు మా బైరెడ్డి కుటుంబం ఇస్తున్న గౌరవం ఇదే అని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దళిత, క్రైస్థవుల రక్షణకు, వారి భవిష్యత్ కు కట్టుబడి పనిచేస్తున్నారని, సీఎం చంద్రబాబు ద్వారా మీకు న్యాయం జరుగుతుందని, టీడీపీ మీకు అండగా ఉంటుందన్నారు. నంద్యాల జిల్లా టీడీపీ యువ నాయకులు ఎన్ ఎం డి ఫయాజ్ మాట్లాడుతూ దళిత, క్రైస్థవులకు టీడీపీ తోనే మేలు జరుగుతుందని, మీకు టీడీపీ అండగా, రక్షణగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నరహరి విశ్వనాధ్ రెడ్డి, ఎనుముల రాజకుమార్, వేల్పుల. విజయ్ కుమార్, కేడెం విశ్వనాధం తో పాటు రాష్ట్రంలోని ప్రముఖ దళిత, క్రైస్థవ సంఘాల ప్రతినిధులు, ఫాస్టర్లుపాల్గొన్నారు.
Arattai