NANDYAL : – నంద్యాల పట్టణంలోని రాపర్తి రామ అకాడమీ ఆఫ్ యోగిక్ సైన్సెస్ కళాశాల నందు గత ఎనిమిది రోజులుగా నిర్వహిస్తున్న బాల బాలికలకు వ్యక్తిత్వ వికాస యోగ శిక్షణా తరగతులు బుధవారం తో ముగిసినట్లు కళాశాల సెక్రటరీ దామోదర కుమార్ రెడ్డి,యూనివర్సిటీ కోఆర్డినేటర్ కవిత,కళాశాల ప్రిన్సిపాల్ జి.లక్ష్మీదేవి తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా పిల్లల్లో శారీరక, మానసిక, భావోద్వేగ సమతుల్యతను పెంపొందించడం లక్ష్యంగా వివిధ యోగాసనాలు, ప్రాణాయామాలు, ధ్యానం, వ్యక్తిత్వ వికాస తరగతులను నిర్వహించినట్లు తెలిపారు.

ఈ శిక్షణ శిబిరంలో పాల్గొన్న బాల బాలికలు,యోగ ద్వారా తమ ఏకాగ్రత,ఆత్మవిశ్వాసం, శారీరక సామర్థ్యం మెరుగుపరచుకున్నారని తెలిపారు. రోజువారీ జీవితంలో యోగాను అలవాటు చేసుకోవాలని బాల బాలికలకు సూచించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా శిక్షణ ను పూర్తిచేసిన బాలబాలికలకు సర్టిఫికెట్లను అందజేశారు
Arattai