NANDYAL May14 :– నంద్యాల జిల్లా ప్రజల ప్రయాణ ఇబ్బందులను గుర్తించి మార్కాపురం నుండి గుంతకల్ వరకు నూతన రైలును హనుమాన్ జయంతి నాడు ప్రారంభం చేసిన నంద్యాల పార్లమెంట్ సభ్యులు డా బైరెడ్డి శబరి కి, విశ్వ హిందూ పరిషత్ నంద్యాల జిల్లా అధ్యక్షులు బుగ్గన చంద్రమౌళీశ్వర రెడ్డి నంద్యాల జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ గత సంవత్సరం మే నెలలో ఈ ప్రతేక రైలు అంశంతో పాటు పలు రైల్వే సమస్యలను వినతి పత్రం ద్వారా ఎంపీ కి మరియు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కి అందించామని అన్నారు.ఎంపి వెంటనే స్పందించి పై స్థాయి అధికారులతో మాట్లాడి కొత్త రైలు ఏర్పాటు చేయడం పై హర్షం తెలియజేశారు.
రాబోయే కాలంలో గాజులపల్లె స్టేషన్ను గాజుల పల్లె – మహానంది రోడ్డుగా పేరు మార్చి నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం మహానంది గొప్పతనాన్ని భారతదేశమంతా తెలియడానికి ఎంపీ బైరెడ్డి శబరి గారు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.గుంటూరు తిరుపతి రైలు ను తిరుచిరాపల్లి వరకు పొడిగించటం హర్షణీయమని అన్నారు. ఈ పొడిగింపుతో తిరువన్నామలై, తిరుచిరాపల్లి వెళ్లడానికి నంద్యాల జిల్లా వాసులకు మరింత ప్రయాణ సౌకర్యం ఏర్పడనుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ పోలేపల్లి సందీప్ , సంపర్క ప్రముఖ్ శేష సాయి , బజరంగ్ దళ్ సురక్ష ప్రముఖ గాండ్ల శివ తదితరులు పాల్గొన్నారు.
Arattai