NANDYAL May21 :- నంద్యాల పట్టణంలోని స్టేట్ బ్యాంకు కాలనీలో నివసిస్తున్న నల్లగట్ల శ్రీరాములు గురువారం మరణించడంతో వారి కుటుంబ సభ్యులలో ఒకరైన వారి కుమారుడు కాంట్రాక్టర్ నల్లగట్ల విజయకుమార్ స్పందించి వారి తండ్రి చివరి కోరిక మేరకు నేత్రదానం చేయాలని సంకల్పించడంతో, ఈ విషయాన్ని జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆర్గాన్ డొనేషన్ కో ఆర్డినేటర్ ఖండే ఆనంద్ గురూజీకి, రెడ్ క్రాస్ మాజీ వైస్ చైర్మన్ రెంటాల మారుతి కుమార్ కు తెలియజేయడంతో వారు వెంటనే స్పందించి రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్లకు సమాచారం అందించగా వారు కర్నూలు నుండి టెక్నీషియన్స్ పిలిపించి అతని రెండు నేత్రాలను సేకరించారు.

ఈ సందర్భంగా ఖండే ఆనంద్ గురూజీ మాట్లాడుతూ నేను రెడ్ క్రాస్ సొసైటీ కోఆర్డినేటర్గా ఎన్నికైన తర్వాత ఒక సంవత్సర కాలంలోనే శ్రీరాములుతో కలిపి 25 మందితో నేత్రాలను సేకరించి రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి ఆధ్వర్యంలో ఎల్ వి ప్రసాద్ హాస్పిటల్ కు పంపడం జరిగిందన్నారు.అలాగే ప్రతి ఒక్కరు కూడా మరణించిన తర్వాత మట్టిలో కలిసిపోయే దానికంటే కాలి బూడిద అయ్యేదానికంటే ఇద్దరికీ చూపులు ప్రసాదించిన వారవుతారు.కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీరిని ఆదర్శంగా తీసుకొని వారు వారి కుటుంబ సభ్యులకు చివరి కోరికగా నేత్రాలను సమర్పించమని తెలియజేయవలసిందిగా కోరారు.
అలాగే మన భారత దేశంలో సంవత్సరానికి సుమారు 50 వేల మందికి పైగా నేత్రాలు కోల్పోయి అంధకారంలో జీవిస్తున్నారని, అటువంటి వారికి నేత్రదానం చేసి ఈ సువిశాల ప్రపంచాన్ని చూసే విధంగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు.నేత్రదానం చేయదలచిన వారు వయసుతో సంబంధం లేకుండా, శుక్లమ ఆపరేషన్ చేయించుకున్న కూడా మరణించిన తర్వాత నేత్రాలను దానం చేయగలరని అలాగే మరణించిన తర్వాత శరీర దానం చేయుటకు కూడా ఇప్పటికీ నలుగురు వ్యక్తులు వారు కుటుంబ సభ్యులకు తెలియజేసి మాకు లిఖితపూర్వకంగా కూడా అందజేశారన్నారు.
ఇలా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నల్లగట్ల శ్రీరాములు గారి కుమారుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ వారి తండ్రి మరణించిన తర్వాత నేత్రాలను దానం చేయమని నాకు జీవించి ఉన్నప్పుడే చెప్పడంతో వారి చివరి కోరికను తీర్చాలని ఉద్దేశంతో నేను మా కుటుంబ సభ్యులతో చర్చించి మా తండ్రి నేత్రాలను ఇవ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ టెక్నీషియన్స్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. రాజేంద్రకుమార్
నంది న్యూస్ రిపోర్టర్
Arattai